ఏపీ సీపీఎస్ ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడింది. సెప్టెంబర్ 1న జరగాల్సిన చలో విజయవాడ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 11 కి వాయిదా వేశారు. ఏపీలో ఇబ్బందికర వాతావరణం ఉండటంతో వాయిదా వేశారు. నోటీసులు, బైండోవర్లు, ఇతర కేసులు పెడుతున్నారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 11న శాంతియుతంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ సీపీఎస్ఈఏ తెలిపింది.