వచ్చేనెల 7న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు పలు కీలక విషయాలపై కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా కేబినెట్ భేటీ ఇప్పటివరకు రెండుసార్లు వాయిదా పడింది. మొదట ఈ నెల 29న, తర్వా త సెప్టెంబర్ 1న భేటీ కావాలని నిర్ణయించగా.. ఈ రెండు తేదీల్లోనూ వాయిదా పడింది. చివరికి సెప్టెంబర్ 7న భేటీ కావాలని సీఎం జగన్ నిర్ణయించారు.