ఏపీలో రూ.555.31 కోట్ల వ్యయంతో వాటర్‌షెడ్లు నిర్మిస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ భూవనరుల విభాగం అదనపు కార్యదర్శి హుకుంసింగ్ మీనా తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం అమరావతిలో అధికారులతో సమీక్ష చేపట్టారు. వాటర్‌షెడ్ల ద్వారా 13 జిల్లాల పరిధిలోని 59 మండలాల్లో 6 లక్షల బీడు భూములు సాగులోకి వస్తాయన్నారు. వర్షపు నీటిని వాటర్‌షెడ్ల ద్వారా నిల్వ చేయొచ్చన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa