దేశంలోని చైనా మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద భరోసా ఇచ్చింది. ఈ కంపెనీలు తయారు చేసే రూ.12,000 కంటే తక్కువ ధర ఉండే ఫోన్లను నిషేధిస్తారన్న వార్తలను తోసిపుచ్చింది. అసలు అలాంటి ఆలోచనే లేదని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కాకపోతే మన దేశంలో మొబైల్ ఫోన్లు తయారు చేస్తున్న చైనా కంపెనీలు భారత్ నుంచి ఎగుమతులు మరింత పెంచాలని కోరారు.