పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్, ఆదేశాల మేరకు వారానికి ఒకసారి ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) శ్రీ G. బిందు మాధవ్ ఐపీఎస్ ఫిర్యాదులు స్వీకరించినారు.
సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మొత్తం 66 పిర్యాదులు అందగా, ఆ పిర్యాదులలో కుటుంబ మరియు ఆస్తి తగాదాలు, భార్య భర్తల కలహాలు మరియు చీటింగ్ కేసులకు సంబంధించిన పిర్యాదు ఎక్కువగా ఉన్నాయి. వెంటనే సంభందిత అధికారులతో మాట్లాడి స్పందన ద్వారా న్యాయం కోసం వచ్చిన వారి సమస్యలని త్వరగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసారు.