ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేని మిలియన్ మార్చ్, సి.ఎం.ఓ ముట్టడి కార్యక్రమాలకు సెప్టెంబర్ ఒకటిన విజయవాడకు వెళ్లేందుకు సిద్ధమైన, పథకం రచించుకున్న జిల్లాకు చెందిన 15 మందిని గుర్తించి కేసులు నమోదు చేసి మేజిస్ట్రేట్ ముందు అనంతపురం జిల్లా పోలీసులు హాజరు పరిచారు. చలో విజయవాడ, మిలియన్ మార్చ్ , సిఎంఓ ముట్టడి కార్యక్రమాల నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లోని ఊబిచెర్ల చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీ చేపట్టిన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS .
సిపియస్ రద్దుకై ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన ఛలో విజయవాడ "మిలియన్ మార్చ్" మరియు సీఎం కార్యాలయం ముట్టడి కార్యక్రమాలకు ఎలాంటి అనుమతులు లేవని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS స్పష్టం చేశారు. ఎటువంటి అనుమతుల్లేని మిలియన్ మార్చ్ కోసం జిల్లా నుండీ ఎవర్నీ వెళ్లకుండా ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని... నిత్యం అప్రమత్తంగా ఉండాలని చెక్ పోస్టు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేని ఈ కార్యక్రమాలకు నిబంధనలు ఉల్లంఘించి వెళితే చర్యలు తప్పవు. చట్ట ఉల్లంఘనకు పాల్పడిన ఉద్యో గులపై Andhra Pradesh Civil Services ( Classification, Control and Appeal) Rules, 1991 ప్రకారం శాఖా పరమైన మరియు చట్టపరమైన చర్యలకు సిఫార్సు చేస్తాం.
ఈ నిరసన కార్యక్రమంలో కొన్ని అసాంఘిక శక్తులు చేరి శాంతి భద్రతల సమస్యను సృష్టించే అవకాశం ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ఎవరైనా ఒత్తిడి చేసినా బలవంతంగా పాల్గొనాలని ప్రేరేపించినా తక్షణమే పోలీసువారికి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఎవరైనా ఇలాంటి నిరసనలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ లు, పోస్టర్లు ప్రచురించినా మరియు షేర్ చేసిన వారిపై చర్యలు తీసుకోబడును. ఇలాంటి అనుమతులు లేని చట్ట వ్యతిరేక నిరసనలను నిలువరించడానికి అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే వివిధ ఉద్యోగుల సంఘాలకు చెందిన పలువురికి సిఆర్పిసి క్రింద నోటీసులు జారీ చేశాం.
జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టు ఏర్పాటు చేసి ముమ్మర వాహన తనిఖీలు చేపట్టాం. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల వద్ద పికెట్లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నాం. జిల్లా ఎస్పీ తో పాటు తాడిపత్రి డీఎస్పీ చైతన్య, తదితరులు తనిఖీలు చేసారు.