విశాఖపట్నం: నర్సీపట్నం డివిజన్ పరిధిలో చెరువుల ఆక్రమణలపై ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నర్సీపట్నం ఆర్డిఓ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన నిర్వహించారు. చెరువుల ఆక్రమణలను తొలగించి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని పరిరక్షణ సమితి సభ్యుడు మురళి ఆధ్వర్యంలో నినాదాలు చేశారు. చెరువుల ఆక్రమణ చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినా ఆక్రమణలు తగ్గడం లేదన్నారు. నర్సీపట్నం డివిజన్ పరిధిలో ప్రస్తుతం చెరువుల పరిస్థితిపై సర్వే నిర్వహించాలన్నారు. చెరువుల ఆక్రమణలు తొలగించాలన్నారు.