వినాయక చవితి సందర్భంగా శ్రీప్రకాష్ స్కూల్ విద్యార్థులు ఈరోజు కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS గారిని మర్యాదపూర్వకంగా కలిసి మట్టి వినాయకుని విగ్రహాన్ని అందించడం జరిగింది.
ఈ సందర్భంగా SP స్పందిస్తూ జిల్లా ప్రజలందరూ పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో రూపొందించిన విగ్రహాలు కాకుండా సహజసిద్దంగా మట్టితో తయారు చేసిన విగ్రహాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, తద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చునని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వినాయక చవితి పండుగను ప్రజలందరూ పోలీసు వారిచే జారీ చేసిన సూచనలను పాటిస్తూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సంతోషకరంగా జరుపుకోవాలని, పోలీసు వారిచే జారీ చేసిన సూచనలు, ప్రజల భద్రత మరియు శ్రేయస్సు దృష్ట్యా చెబుతున్నామని SP ఈ ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది.