పేద ప్రజల కడుపు నింపే అన్న క్యాంటీన్లను ధ్వంసం చేయడం ద్వారా మీరు సాధించేది ఏమిటి జగన్? అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చేమ్ నాయుడు ప్రశ్నించారు. సోమవారం రాత్రి కుప్పం నియోజకవర్గ పరిధిలో జరిగిన అన్నా కాంటీన్ ధ్వంసం పై ఆయన స్పందిస్తూ... మీ పార్టీని పెట్టింది పేదల పొట్టపై కొట్టడానికా? అర్ధరాత్రి దొంగల్లా వచ్చి అన్న క్యాంటీన్ ను మళ్ళీ ధ్వంసం చేశారు. అన్నం తినే వాడు, ఆకలి విలువ తెలిసిన వాడు ఎవ్వడూ ఇటువంటి పనులు చేయరు. మీ ఈ దుశ్చర్యలే మీ పార్టీకి సమాధి కడతాయి, వేచి చూడండి అని హెచ్చరించారు.