ఆంధ్రప్రదేశ్ లో డిపార్ట్మెంటల్ పరీక్షలు రాసే ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు చేసింది. ఓటీపీఆర్లో జిల్లా పేరును అప్డేట్ చేయాలని సూచించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించిన నేపథ్యంలో ఉద్యోగులు తమ జిల్లా పేరును అప్డేట్ చేసుకోవాలని ఏపీపీఎస్సీ పేర్కొంది. ఉద్యోగులు తాము పనిచేస్తున్న జిల్లా పేరును ఓటీపీఆర్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది తెలిపింది.