యూపీలోని ఖుషీనగర్ జిల్లాలో దారుణం జరిగింది. పొరుగున ఉండే ఏడాదిన్నర బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై 22 ఏళ్ల రవి రాయ్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. చాక్లెట్లు, బొమ్మలు ఇస్తానని చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి, బాలికపై నిందితుడు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు వారు వెల్లడించారు. దీంతో పలు సెక్షన్ల క్రింద అతడిపై కేసులు నమోదయ్యాయి.