జార్ఖండ్‌లోని బీజేపీ నేత సీమా పాత్రపై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. సునీత అనే పనిమనిషిని నాలుకతో టాయిలెట్‌ను శుభ్రం చేయించడంతో పాటు ఇనుపరాడ్డుతో ఆమె ముఖాన్ని సీమాపాత్ర దారుణంగా కొట్టింది. శరీరమంతా తీవ్రగాయాలతో బాధితురాలు సునీత ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సీమా కుమారుడు ఆయుష్మాన్ స్పందించి సునీతను కాపాడారు. సీమాపై రాంచీ పోలీసులు కేసు నమోదు చేశారు.