ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు 62.70 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ జరగనుంది. పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.1,594.66 కోట్ల మొత్తాన్ని విడుదల చేసింది. రాష్ట్రంలోని 2.66 లక్షల మంది వలంటీర్లు పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ఐదు రోజుల్లోగా వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. పింఛన్ల అందజేతలో అక్రమాలకు తావులేకుండా బయోమెట్రిక్, ఐరిస్ అమలు చేస్తున్నారు.