కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో R & B అధికారులకు సమాచారం ఇచ్చి, అనుమతితో నిర్మించిన జనసేన పార్టీ దిమ్మెను నిన్న అర్థరాత్రి (ఆగస్ట్-31, బుధవారం)ధ్వంసం చేసిన వైసీపీ పార్టీ థానోస్ దళం అని జనసేన నాయకులూ వాపోయారు. క్రేన్ లాంటి వాహనాన్ని తీసుకువచ్చి రాత్రికి రాత్రే జనసేన కి సంభందించిన దిమ్మె తొలిగించినట్లు తెలియజేసారు.
అన్ని రకాల పెర్మిషన్స్ తీసుకున్నప్పటికీ స్థానిక వైసీపీ నాయకులూ కుట్ర పూరితంగా ఇలాంటి చర్యలకి పాల్పడుతున్నారని తెలియజేసారు. రాబోయే రోజుల్లో వీటన్నిటికీ సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి అని హెచ్చరించారు.