పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. ఆర్ఎస్ఎస్ అంత చెడ్డదేమీ కాదన్న మమత వ్యాఖ్యలను ఆయన ట్విట్టర్ వేదికగా గురువారం తప్పుబట్టారు. ఆర్ఎస్ఎస్ హిందూ దేశాన్ని కోరుకుంటుందన్నారు. దాని చరిత్ర ముస్లిం వ్యతిరేక విద్వేషపూరిత నేరాలతో నిండి ఉందని వ్యాఖ్యానించారు. అలాంటి సంస్థను మమతా ప్రశంసించిందని మండిపడ్డారు.