కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి వరద నీటిని వదలడంతో దిగువ ప్రాంతాలైన మండల పరిధిలోని కె.కొత్తపాలెం,
బొబ్బరిలంక, మోపిదేవి, వార్పు గ్రామాల్లో పంటల్లోకి వరద నీరు చొచ్చుకొచ్చింది. పులిగడ్డ బ్రిడ్జి వద్ద 14 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. వరద ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని ముంపు గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జలవనరుల శాఖ డీఈ రవికిరణ్ సూచించారు.