ఈ రోజు గుంటూరు రేంజ్ డి.ఐ.జి డాక్టర్ త్రివిక్రమ వర్మ IPS వార్షిక తనీఖీ లో భాగంగా మంగళగిరి రూరల్ సర్కిల్ ఆఫీస్ ను మరియు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. సర్కిల్ ఆఫీస్ నిర్వహణ ,సిబ్బంది పనితీరు ,విధులు ముఖ్యమైన కేసులు దర్యాప్తు రిసెప్షన్ కౌంటర్ మరియు కంప్యూటర్ గదిని పరిశీలించారు. మిస్సింగ్ కేసులు , మహిళలు మరియు చిన్న పిల్లల నేరాలు, సైబర్ నేరాలు మరియు అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
గణేష్ నిమజ్జనానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు డి.ఐ.జి డాక్టర్ త్రివిక్రమ వర్మ ఐపిఎస్ తో పాటు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్ ఐపిఎస్ , గుంటూరు లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ శ్రీ అనిల్ కుమార్ , నార్త్ డిఎస్ పి శ్రీ రాంబాబు ,మరియు ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.