పల్నాడు జిల్లా, నరసరావుపేట పల్నాడు బస్ స్టాండ్ సెంటర్ లో వైఎస్ విగ్రహం వైసిపి నేతలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఈ విగ్రహానికి అనుమతులు లేవని , అనుమతి లేని విగ్రహం ఏర్పాటును నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల జారీ చేసినప్పటికీ పనులు నిలిపివెయ్యకుండా కొనసాగుతున్న వైఎస్ విగ్రహ ఏర్పాట్లు పనులు , వైసీపీ నేతలు కొనసాగిస్తూనే ఉన్నారు. కోర్టు ఆదేశాలతో అలానే, వైసీపీ స్థానిక నాయకుల ఒత్తిడితో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తుంది.కోర్ట్ పనులు ఆపాలని చెప్పిన , ఖాతరు చెయ్యకుండా కోర్టు దిక్కారణ చేస్తున్న వైసీపీ నేతలకి వ్యతిరేకంగా పిటీషన్ దాఖలు చేసేందుకు టీడీపీ వర్గాలు సిద్దమౌతున్నాయి.