ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి నిమజ్జన సమయంలో అపశృతి, ఇద్దరు యువకులు మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 02, 2022, 01:53 PM

పల్నాడు జిల్లా, అమరావతి పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక విగ్రహల నిమజ్జన ప్రదేశాన్ని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐ.పి.ఎస్ పరిశీలించారు. వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసేలా రెవెన్యూ, మునిసిపాలిటి,విద్యుత్ మరియు అగ్నిమాపక శాఖలతో సమన్వయము చేసుకుని నిమజ్జన ఘట్టాన్ని పూర్తి చేసే విధంగా మా పోలీస్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. 


నిమజ్జన సమయంలో ఎటువంటి అపశ్రుతులు జరుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలలో బాగంగా లైటింగ్ మరియు బారికేడింగ్ ను ఏర్పాటు చేస్తున్నామని,ఎక్కడా పొరపాట్లు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం పూర్తి అయ్యేలా తగిన బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. ఇది ఇలా ఉండగా నిమజ్జనానికి వెళ్లిన భక్తులలో ఇద్దరు యువకులు అమరావతిలో గురువారం రాత్రి గల్లంతు ఐనట్లు తెలుస్తుంది. నిమజ్జన సమయంలో కాలు జారీ నదిలో పడటంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా , మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com