సమయం దొరికినప్పుడల్లా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి విజయసాయిపై ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో బ్రోకర్ పనులు చేసే విజయసాయిరెడ్డిని బ్రోకర్ రెడ్డి అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. లిక్కర్ అంశంలో సీఎం జగన్ ను మందలించడానికే ఢిల్లీకి మోదీ పిలిపించారని అంటున్నారని చెప్పారు.