మామలా రక్షిస్తానన్న మాయ మాటలు చిన్నారి సంధ్య ప్రాణాలు తీసుకువస్తాయా జగన్ రెడ్డి గారూ! వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఆ గ్రామ సమస్యలపై కనీస దృష్టి సారించినా చిన్నారి సంధ్య మన మధ్య ఉండేది. అమ్మ ఒడి ఇచ్చానంటూ అమ్మ ఒడిలో బిడ్డల ప్రాణాలు తీయడం న్యాయమేనా? అని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ ప్రశ్నించారు.
ప్రకృతి విపత్తులు ఒకవైపు విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో, విష జ్వరాలు ప్రజలని అల్లకల్లోలం చేస్తుంది. దీనిపై స్పందించిన లోకేష్ మాట్లాడుతూ.... విలీన మండలాల్లో విషజ్వరాలతో జనం విలవిల్లాడుతున్నారు. ఆస్పత్రిలో పరీక్షల కిట్లు, మందులు లేవు. చింతూరు ఏరియాలో ఇప్పటివరకూ నలుగురు మృతిచెందినా సర్కారులో చలనం లేదు. ముఖ్యమంత్రి గారు, మానవత్వం అనేది ఏ మూలన ఉన్నా.. సంధ్యలాంటి మరో చిన్నారి బలి కాకుండా చర్యలు తీసుకోవాలి అని హెచ్చరించారు.