ఏపీ వ్యాప్తంగా ప్రజాపోరు సభలు నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ కసరత్తు చేస్తోంది. 5 వేల చోట్ల ఈ సభలను నిర్వహించాలని భావిస్తున్న కమలం పార్టీ.. సభల నిర్వహణ, ఏర్పాట్లపై కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్రమంత్రులు, ఎంపీలు,జాతీయ నేతలను ఈ సభలకు ఆహ్వానించనుండగా.. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన తెలుపుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ సందర్భంగా అన్నారు.