టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ దఫా భక్తుల సమక్షంలోనే జరగనున్నాయి. కరోనా కారణంగా భక్తులు లేకుండా వెంకన్న బ్రహ్మోత్సవాలను నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)... కరోనా విస్తృతి బాగా తగ్గిన నేపథ్యంలో ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలను భక్తుల సమక్షంలో నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను టీటీడీ విడుదల చేసింది.
ఈ షెడ్యూల్ ప్రకారం.. బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడానికి ముందుగా ఈ నెల 20న ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీవారి ఆలయంలో సంప్రదాయబద్ధంగా కోయిల్ అళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ఈ నెల 26న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుండగా.... ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు 9 రోజుల పాటు వివిధ రూపాల్లో వివిధ వాహన సేవల్లో శ్రీవారు మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa