వాట్సాప్ చూడటం సమస్య కాకపోయినా మనం ఆన్ లైన్ లో ఉన్నామన్న విషయం ఎదుటివారికి తెలిస్తే వచ్చే సమస్యలు అధికంగానే ఉంటాయి. చాటింగ్ అన్నది వ్యక్తిగత విషయం. వాట్సాప్ లో ఒకరితో చాట్ చేస్తుంటే, మన కాంటాక్ట్ లిస్ట్ లోని వారు.. మనం ఆన్ లైన్ లో ఉన్నట్టు తెలుసుకోగలరు. మరి ఇది గోప్యతకు భంగకరమేగా? అందుకే వాట్సాప్ దీనికి పరిష్కారం చూపించనుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. మనం వాట్సాప్ లో ఉన్నప్పటికీ, అవతలి వారికి తెలియదు. త్వరలో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ ఇప్పటికే ప్రకటించింది. తాము ఆన్ లైన్ లో ఉన్న విషయాన్ని ప్రైవేటుగా ఉంచుకోవాలని అనుకునే వారికి ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.
వాట్సాప్ ఈ సదుపాయాన్ని తెచ్చే వరకూ వేచి చూడక తప్పదు. అయితే, ఈ లోపు తాము చివరిగా ఎప్పుడు వాట్సాప్ ను చూసిందన్నది ఆఫ్ చేసుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్ యాప్ తెరిచి పై భాగంలో మూడు డాట్లు ఉన్న చోట క్లిక్ చేయాలి. అక్కడి నుంచి సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. అందులో అకౌంట్ ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత ప్రైవసీ ఆప్షన్ ఎంచుకోవాలి. లాస్ట్ సీన్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని, అక్కడ మై కాంటాక్ట్స్, నో బడీ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిల్లో ఒకటి సెలక్ట్ చేసుకోవాలి.