రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భిల్వారా నగరానికి చెందిన 24 ఏళ్ల యువతికి, భాగోర్కు చెందిన వ్యక్తితో మే 11న పెళ్లి జరిగింది. ఆ తర్వాత వారి ఆచారమైన కుక్డి విధానంలో వధువుకు కన్యత్వ పరీక్ష నిర్వహించగా, ఆమె విఫలమైంది. పక్కింటి వ్యక్తి గతంలో తనపై అత్యాచారం చేసినట్లు వధువు పేర్కొంది. దీనిపై అత్తింటి వారు పంచాయతీ పెట్టగా పెద్దలు ఆమెకు రూ.10 లక్షల జరిమానా విధించారు.