బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టులు, వన్డే ఫార్మాట్ లపై మరింత దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రహీమ్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. బంగ్లాదేశ్ ప్రీమియమ్ లీగ్, ఇతర టోర్నీల్లో అడతానని తెలిపాడు. ఇక బంగ్లాదేశ్ జట్టు ఆసియా కప్ లో వరుస ఓటములతో గ్రూప్ స్టేజ్‌లోనే ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే.