రాయచోటి మండల పరిధిలోని చెన్నముక్కపల్లెలో ఉన్న లయన్స్ కంటి ఆసుపత్రిలో ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించినట్లు చైర్మన్ స్వరూపగుప్త తెలిపారు. రాయచోటి నియోజకవర్గం నుంచే కాకుండా రాజంపేట, కలకడ, కదిరి, రైల్వేకోడూరు, గుర్రంకొడ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 50 మందికి పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కంటి సమస్య తీవ్రంగా ఉన్న 32 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. గతంలో ఆపరేషన్లు చేయించుకున్న 50 మందికి కళ్లద్దాలు, మందులు ఉచితంగా పంపిణీ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ అన్వర్ బాషా, ఏపీఐఐసీ డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి, వైద్యులు సురేష్ బాబు పాల్గొన్నారు.