లఖోలి-రాయ్‌పూర్ అర్. వి బ్లాక్ స్టేషన్‌ల మధ్య డబ్లింగ్ పనులతో పాటు నయా-రాయ్‌పూర్ స్టేషన్‌ను ప్రారంభించడం, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలోని మందిర్ హసౌద్, రాయ్‌పూర్ అర్. వి బ్లాక్ స్టేషన్‌ల యార్డ్ రీమోడలింగ్ కారణంగా, పలు రైలు సేవలు రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ. కె. త్రిపాఠి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేసారు.
ఈమేరకు (గాంధీధామ్- పూరి) ఎక్స్‌ప్రెస్ ఈనెల 7న గాంధీధామ్ నుండి బయలుదేరి (పూరి-గాంధీధామ్) ఎక్స్‌ప్రెస్ 10న పూరి నుండి బయలుదేరుతుందన్నారు. విశాఖపట్నం-కోర్బా ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం నుండి 11న బయలుదేరి
కోర్బా-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ కోర్బా నుండి 12. న బయలుదేరుతుందన్నారు. విశాఖపట్నం-దుర్గ్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం నుండి 6 నుండి 12 వరకు బయలుదేరుతుందని దుర్గ్- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ దుర్గ్ నుండి 7 నుండి 13 వరకు బయలుదేరుతుందన్నారు.
రైళ్ల పాక్షిక రద్దు స్వల్ప ముగింపు.
విశాఖపట్నం-రాయ్‌పూర్ ప్యాసింజర్ 6 నుండి 12 వరకు విశాఖపట్నం నుండి బయలుదేరి మహాసముంద్ వద్ద షార్ట్ టర్మినేట్ చేయబడుతుందని మహాసముంద్ -రాయ్‌పూర్ మధ్య ఈ రైలు సర్వీసు ఉండదన్నారు. రాయ్‌పూర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రాయ్‌పూర్‌కు బదులుగా 7 నుండి 13 వరకు మహాసముంద్ నుండి బయలుదేరుతుందని రాయ్‌పూర్-మహాసముంద్ మధ్య ఈ రైలు సర్వీసు లేదని స్పష్టం చేసారు.
రైళ్ల మళ్లింపు.
తిరుపతి-బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను 8 , 11 తేదీలలో తిరుపతి నుండి బయలుదేరి టిట్‌లాగఢ్-
సంబల్‌పూర్-ఝార్సుగూడ మీదుగా దారి మళ్లించిన మార్గంలో నరకం ఉన్నామని తెలిపారు.
బిలాస్‌పూర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ 10 , 13 తేదీలలో బిలాస్‌పూర్‌లో బయలుదేరి జార్సుగూడ- సంబల్‌పూర్ - టిట్‌లాగఢ్ మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుందన్నారు. అలాగే పూరి-అహ్మదాబాద్‌ను 6, 08. 09. 22, 09. 09. 22 10. 09. 22, 13. 09. 22 , 15. 09. 22 తేదీల్లో ప్రూరి నుండి బయలుదేరి టిట్లాపూర్ –బిహార్‌పూర్-సంబల్ మీదుగా దారి మళ్లించిన మార్గంలో విజయనగరం-టిట్లాగఢ్‌కు బదులుగా రాయ్‌పూర్ మీదుగా నడుపుతామని పేర్కొన్నారు అహ్మదాబాద్-పూరీ ఎక్స్‌ప్రెస్ 08. 09. 22, 10. 09. 22, 11. 09. 22, 12. 09. 22 , 15. 09. 22 తేదీలలో అహ్మదాబాద్‌లో బయలుదేరి రాయ్‌పూర్-బిలాస్‌పూర్-ఝార్సుగూడ-సంగర్‌ట్ మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుందన్నారు.