విజయవాడ గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..”బతకడం ఎలాగో నేర్పించేది టీచర్లే. విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. మన విద్యా వ్యవస్థ ఎలాగ ఉందో ఆలోచించాలి. విద్యార్దులు తనకన్నా గొప్పగా జీవించాలని తప్పించేది గురువే. విద్యాశాఖ పై చేసినన్ని సమీక్షలు మరే శాఖ పై చేయలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్దులు ఉన్నత స్థానంలో ఉండడమే తన లక్ష్యం” అని జగన్ అన్నారు.