విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చడంలో తమ జీవితాన్ని అంకితం చేసే గురువులకు సమాజంలో ప్రత్యేక స్థానం ఉంది. అజ్ఞానాన్ని తొలగించి, క్రమశిక్షణను అలవర్చే గురువులను దేవుడితో సమానం మనం పూజిస్తుంటాం. అలాంటి గురువుల పాత్రకు వన్చె తెచ్చిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన జయంతిని 1967 సెప్టెంబర్ 5 నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. గురువులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు.