తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు బ్రిటన్ నుంచి వచ్చిన ఇద్దరు విదేశీ పర్యాటకులుక ఆగ్రా రైల్వే స్టేషన్లో తాజాగా షాక్ తగిలింది. టాయిలెట్‌కు వెళ్లగా జీఎస్టీతో కలిసి రూ.112 ఛార్జీ విధించారు. సాధారణంగా రూ.5 లేదా రూ.10 చొప్పున వసూలు చేస్తారు. అయితే టాయిలెట్ నిర్వహణ సిబ్బందికి ఆ మొత్తాన్ని గైడ్‌గా వ్యవహరించే వ్యక్తి చెల్లించారు. అనంతరం దీనిపై ఆయన ఐఆర్సీటీసీకి ఫిర్యాదు చేశారు.