కెనడాలోని సస్కట్చేవాన్ ప్రావిన్స్‌లో ఆదివారం దారుణం జరిగింది. ఇద్దరు దుండగులు 10 మందిని కత్తితో పొడిచి చంపారు. వారి దాడిలో మరో 15 మంది గాయపడ్డారు. మైల్స్ (30), డామియన్ శాండర్సన్ (31)లను అనుమానితులుగా పోలీసులు ప్రకటించారు. వారి కోసం గాలింపు చేపట్టారు. దీనిపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. ఈ ఘటన హృదయ విదారకమని, బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ప్రకటించారు.