కోల్‌కతాకు చెందిన త్రిపర్ణా చక్రవర్తి 'భారత తొలి స్లీప్ ఛాంపియన్'గా టైటిల్ సాధించింది. తద్వారా రూ.5 లక్షల ప్రైజ్‌మనీ అందుకుంది. పరుపుల తయారీ సంస్థ వేక్‌ఫిట్ ఇటీవల నిర్వహించిన 'స్లీప్ ఇంటర్న్‌షిప్' పేరుతో నిర్వహించిన పోటీలో ఆమె విజేతగా నిలిచింది. ఫైనల్‌కు చేరుకున్న మరో ముగ్గురికి రూ.లక్ష చొప్పున అందించింది. ఈ పోటీలో పాల్గొన్న వారు రోజుకు 9 గంటల పాటు నిద్రపోవాలి.