రష్యా దాడుల కారణంగా తమ దేశంలో విద్యుత్ గ్రిడ్ స్తంభించిందని ఉక్రెయిన్ సోమవారం పేర్కొంది. రష్యా దాడుల్లో అగ్నిప్రమాదం వల్ల జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌తో కనెక్షన్‌ను కోల్పోయామని ఆందోళన వ్యక్తం చేసింది. గ్రిడ్‌కు విద్యుత్ సరఫరా చేయబడే రిజర్వ్ లైన్‌ను ఉద్దేశపూర్వకంగా డిస్కనెక్ట్ చేశారని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. దీనిపై అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ సైతం ఆందోళన వ్యక్తం చేసింది.