జమ్మలమడుగు నియోజకవర్గ మైలవరం జలాశయం నుంచి ఉత్తర, దక్షిణ కాలువలకు నీటి విడుదల కొనసాగుతోందని జలాశయ ఏఈఈ గౌతమ్ రెడ్డి తెలిపారు. జలాశయం నుంచి దక్షిణ కాలువకు 120 క్యూసెక్కులు , ఉత్తర కాలువకు 50 క్యూసెక్కులు నీటిని వదులుతుండగా మైలవరం జలాశయానికి మంగళవారం సాయంత్రానికి ఎలాంటి ఇన్ఫ్లో లేదు. మైలవరం జలాశయం పూర్తి నీటి నిలువ సామర్థ్యం 6, 500 టిఎంసిలు కాగా ప్రస్తుతం నాలుగు టీఎంసీలు నీరు నిలువ ఉందని ఏఈఈ తెలిపారు.