రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఎటువైపు ఉన్నారన్నది తెలుసుకునేందుకు "మూడ్ అఫ్ ఏపీ" పేరుతో శ్రీ ఆత్మసాక్షి (SAS) గ్రూప్ సంస్థ జూన్ 2 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు 3 దశల్లో 1లక్ష 37 వేల 700 మంది ఓటర్లను నేరుగా కలిసి సర్వే చేసింది అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఆత్మసాక్షి సర్వే ప్రకారం 2024లో ఏపీ ప్రజలు తెలుగుదేశం పార్టీకే పట్టం కట్టనున్నారు. టిడిపి 95 అసెంబ్లీ స్థానాల్లో విజయబావుటా ఎగరవేయనుందని సర్వేలో తేలింది. వైసీపీ 75 స్థానాలతో సరిపెట్టుకుంటుందని, జనసేన పార్టీకి 5 సీట్లు దక్కే అవకాశం ఉందని సర్వేలో పేర్కొన్నారు. ఓట్ల శాతానికి వస్తే... అన్ని పార్టీల కంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి 44.5 శాతం ఓట్లు వస్తాయన్నది స్పష్టంగా తేలింది. వైసీపీకి ఈసారి కేవలం 43 శాతం ఓట్లే వస్తాయి.
జనసేన పార్టీ ఈసారి 9 శాతంతో నిలవనుంది. 1.5 శాతం ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా నిలవనున్నారు అని ఈ సంభందిత సర్వే చెప్తున్నట్లు టీడీపీ వర్గాలు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.