కడప జిల్లా, కడప నగరంలోని అన్న కాంటీన్ ని నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేయడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ , అందువలన తొలగిస్తున్నట్లు తెలియజేసారు.
ఈ సందర్భంగా , ఈ విషయం పై టీడీపీ అది నాయకులూ నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ... కూల్చడంలో ఉన్న తృప్తి మీకు వేరే ఎందులోనూ కనిపించకపోవడం ఏపీ దురదృష్టం. నిర్మించడం ఎంత కష్టమో, కూల్చడంతో ఎంత నష్టమో తెలుసుకునే సమయం కూడా ఇక మీకు లేదు.
ప్రభుత్వ ఆలోచనలు ఇలా కూడా ఉంటాయా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.ఆవేదన చెందుతున్నారు. అవి మీకు, మీ ప్రభుత్వానికి ఎన్నటికీ అర్థం కావు అని ఆవేదన వ్యక్తపరిచారు.