"తాత్కాలిక సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు ,ఆత్మహత్య వద్దు బ్రతకడం ముద్దు""" ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పాఠశాలలు మరియు కళాశాలలో అవగాహన సదస్సులు గుంటూరు జిల్లా పోలీసులు నిర్వహించినారు. ఆవేశాలలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేటితరం యువత లో మార్పులు తీసుకునే వచ్చే నిమిత్తముగా ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డి.జి.పి గౌరవ శ్రీ కె. రాజేంద్ర నాద్ రెడ్డి ఐపిఎస్ గారి యొక్క ఆదేశాలపై పోలీస్ శాఖ వారు సంయుక్తంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులందరూ ఒకరితో ఒకరు స్నేహాంగా ఉండాలని, ఏదైనా సమస్య ఏర్పడిన స్నేహితులతో కానీ అధ్యాపకులతో గాని మాట్లాడి సదరు సమస్య పరిష్కరించుకోవాలని , మహిళా సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాటు చేసిన దిశా యాప్ ను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ముఖ్య అతిథులు మరియు విద్యార్థిని విద్యార్డులు ఆత్మహత్య వద్దు బ్రతకడం ముద్దు. ఆత్మహత్యను నివారిరణకు బాధ్యతగా నా వంతు కృషి చేస్తానని విద్యార్థిని విద్యార్థులు ప్రతిజ్ఞ చేసినారు.