దేశ జనాభాలో సగ భాగమైన బీసీలకు అరాకొరా సీట్లిచ్చి అతికొద్ది జనాభా ఉన్న సామాజిక వర్గాలు హస్తగతం చేసుకుంటున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు విమర్శించారు. మంగళవారం సాయంత్రం బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూర్వ పద్ధతిలో స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు సాధించుకునేందుకు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం న్యాయబద్ధమైన పోరాటం చేస్తుందన్నారు.