ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్య పర్యవేక్షణ మరియు నియంత్రణ కమీషన్ సభ్యులు డాక్టర్ సి ఏ వి ప్రసాద్ పెదకాకాని లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎల్. ఈ) ను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. బేస్ లైన్ పరీక్ష జరిగిన విధానం మరియు విద్యార్థుల సామర్ధ్య ఫలితాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. బేస్ లైన్ టెస్టు కు సంబంధించిన సమగ్ర వివరాలను పాఠశాల ఉపాధ్యాయిని పి. జ్యోతి ని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నాడు నేడు పథకం ద్వారా ఎన్నో పాఠశాలల రూపురేఖలను మార్చిందని, రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల ఎంతో ఆసక్తి గా ఉందని, విద్యతోనే పేదల తలరాత మారుతుందని అందుకే విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న వివిధ ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క విద్యార్థికి అందేలాగా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. విద్యార్థుల హాజరు నూరు శాతం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడి ఉపాధ్యాయిని సి. హెచ్. ప్రభావతి మరియు ఉర్దూ పాఠశాలల ఉప తనిఖీ అధికారి యం. డీ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.