పొన్నూరు పట్టణం 3వ వార్డు , ఎరుకులవాడ కు చెందిన మన్నే రాకేష్ తండ్రి మన్నే సాంబశివరావు ఈనెల 3 వ తేది సాయంత్రం 5. 30 గం: లకు తన ఇంటి వద్ద నుండి వాకింగ్ అని వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఫిర్యాది అయిన మన్నే రాకేశ్ అతని బంధువులను విచారించి మరియు చుట్టుపక్కల గ్రామాలు వెతికి ఫలితం లేకపోవడంతో తగు చర్యలు నిమిత్తం పొన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్సై హసీమ్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.