ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యను గొంతు కోసి హతమార్చిన భర్త

Crime |  Suryaa Desk  | Published : Wed, Sep 07, 2022, 02:00 PM

నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండలం ఎత్తొండలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న భార్య రాశి కవిత(26)ను భర్త సాయిలు అలియాస్ సురేష్  అర్ధరాత్రి గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశాడు. తరువాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. స్థానికుల కథనం ప్రకారం భార్యా భర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. కవిత తన అత్త నర్సవ్వతో కూడా గొడవకు దిగుతోంది. సోమవారం కూడా అత్తపై కవిత దాడికి దిగగా అత్త నర్సవ్వ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీనితో కోపోద్రిక్తుడైన భర్త సురేష్ భార్యను హత్య చేసినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com