ఈ నెల 27 నుంచి జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ సర్వదర్శనం అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. వీఐపీ బ్రేక్, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు కల్పించే ప్రివిలేజ్ దర్శనాలను రద్దుచేసింది. రూ.300 దర్శనం, శ్రీవాణి ట్రస్టు దాతల దర్శన టికెట్లను కూడా క్యాన్సల్ చేసింది. ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు వీలుగా 50 శాతం గదులను అందుబాటులో
ఉంచింది.