కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 14 వేల పీఎం శ్రీ మోడల్ స్కూళ్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిని కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు నడిపే స్కూళ్ల నుంచి ఎంపిక చేయనున్నారు. దీనికోసం ఐదేళ్లలో రూ.27,360 కోట్లు ఖర్చు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.