సీపీఎస్ రద్దుపై మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక పూర్వపరాలు చర్చిస్తే సీపీఎస్ రద్దు సాధ్యం కాదని తేలిందని చెప్పారు. సీపీఎస్ కంటే మెరుగైన విధానం కోసమే ప్రభుత్వం జీపీఎస్ తీసుకొచ్చిందని పేర్కొన్నారు. అయితే సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.