ఏపీ పోలీసు శిక్షణ కళాశాలలో కరోనా కలకలం రేపింది. తిరుపతి జిల్లాలోని పోలీస్ శిక్షణ కళాశాలలో కరోనా కేసులు వెలుగుచూశాయి. కళాశాలలో శిక్షణ పొందుతున్నవారిలో 11 మందికి కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. బాధితుల్లో ఐదుగురికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. 105 మంది శిక్షణ పొందుతున్న ఈ కళాశాలలో కరోనా కేసులు వెలుగుచూడటంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రిన్సిపల్ రాధాకృష్ణ తెలిపారు.