ఏపీ కేబినేట్ ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకొంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన అమరావతిలోని ఏపీ సచివాలయంలో భేటీ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. దాదాపుగా రెండు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో జగన్ కేబినెట్ పలు కీలక అంశాలకు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అంతేకాకుండా రాష్ట్రంలో రూ.1.21 లక్షల కోట్ల పెట్టుబడులకు కూడా జగన్ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర సచివాలయంలో అదనంగా 85 పోస్టులను ప్రమోషన్ల ఆధారంగా భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగనన్న చేయూత నిదుల విడుదలకు ఆమోదం తెలిపింది. భావనపాడు పోర్టు విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్... దివ్యాంగులకు ఉద్యోగాలు, ప్రమోషన్లలో 4 శాతం రిజర్వేషన్ల అమలుకు పచ్చ జెండా ఊపింది.