మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్ లభించడమే కాదు ఆయన అమెరికా వెళ్లేందుకు కూడా కోర్టు అనుమతించింది. ఏపీ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ కేసులు నమోదైన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు మంగళవారం ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ బెయిల్‌కు షరతులను జోడించి జారీ చేసిన ఉత్తర్వులను సవరించాలంటూ నారాయణ మరోమారు బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ కింద దాఖలైన ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది.
వైద్య చికిత్సల కోసం అమెరికా వెళ్లాల్సి ఉందని తన పిటిషన్‌లో పేర్కొన్న నారాయణ... ముందస్తు బెయిల్ షరతులను సడలించాలని కోరారు. ఈ పిటిషన్‌పై నారాయణ తరఫు న్యాయవాది వాదన విన్న హైకోర్టు... ముందస్తు బెయిల్ షరతులను సడలించింది. వైద్య చికిత్సల నిమిత్తం అమెరికా వెళ్లి వచ్చేందుకు నారాయణకు హైకోర్టు 3 నెలల సమయాన్ని కేటాయించింది.