రాష్ట్ర మంత్రులపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఈ రోజు నిర్వహించిన కేబినెట్ సమావేశంలో మంత్రులకు సీఎం వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్షాల ఆరోపణలకు మంత్రులు కౌంటర్ ఇవ్వడం లేదని, తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేసినా ప్రశ్నించరా అని నిలదీశారు. నిత్యం ప్రభుత్వంపై బురద జల్లుతుంటే చూస్తూ ఊరుకుంటారా.. ఆరోపణలను ఖండించకపోతే మీకు పదవులెందుకంటూ సీరియస్ అయ్యారు.