భారత్-చైనా మధ్య సరిహద్దు సంబంధాలలో కీలక ముందడుగు పడింది. వాస్తవాధీన రేఖ వెంట ఉన్న తూర్పు లద్ధాలోని గోగ్రా- హాట్ స్పింగ్స్ నుంచి భారత్-చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది. ఇరుదేశాల సైనిక కమాండర్ల మధ్య ఇటీవల జరిగిన 16వ విడత చర్చల సందర్భంగా ఏకాభిప్రాయం కుదిరినట్లు ప్రకటించాయి. సమన్వయం, ప్రణాళికబద్దంగా ఇరుదేశాల బలగాల ఉపసంహరణతో సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు ఏర్పడనున్నాయని పేర్కొన్నాయి.